News February 15, 2025

MNCL: సకాలంలో వైద్యం అందకే శిశువు మృతి: సీపీఎం

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందనందునే నిండు గర్భిణి కడుపులోనే శిశువు మరణించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు రోజులుగా బాధితురాలు,కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్న కనికరం చూపించలేదన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 6, 2025

బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బండి సంజయ్ సభకు అనుమతి రద్దయ్యింది. సా. బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉంది. సభకు అనుమతి ఇచ్చి, ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అడ్డుకొన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సభ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు బోరబండకు చేరుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ లీడర్లు గుర్తుచేశారు.

News November 6, 2025

ఇజ్రాయెల్‌లో JOBS.. రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు

image

ఇజ్రాయెల్ దేశంలో సెరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డర్స్(మేసన్స్), జిప్సం వర్క్, ఉద్యోగాల కోసం రేపు నిజామాబాదులో ఎన్రోల్మెంట్, అవగాహనా డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. 21 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి, 10వ తరగతి పాసైనవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కోరారు. VENUE- జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్. CONTACT- 9959456793.

News November 6, 2025

భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షియస్, బార్ట్‌లెట్, ఇల్లిస్, జంపా.