News April 11, 2025
MNCL: సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు: కలెక్టర్

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సన్నబియ్యం విక్రయించడం, కొనుగోలు చేయవద్దని, విక్రయిస్తే రేషన్ కార్డు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్లు అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News December 20, 2025
అమరావతి తప్ప CBNకు ఇంకేమీ పట్టదు: అమర్నాథ్

AP: అమరావతి ప్రొజెక్ట్ అయితే చాలు ఇతర ప్రాంతాలేమైపోయినా ఫర్వాలేదన్నట్లు CM ఉన్నారని YCP నేత G.అమర్నాథ్ విమర్శించారు. ‘విశాఖ భూములను తన వారికి కట్టబెట్టి అక్కడ ఏ యాక్టివిటీ లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. సెటిల్మెంట్లపై పవన్ IAS, IPSలను కాకుండా భూముల్ని దోచిపెడుతున్న CBNను ప్రశ్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు తప్పదు’ అని హెచ్చరించారు. అందర్నీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు.
News December 20, 2025
భద్రాద్రి: వివాహేతర సంబంధం.. భర్తను చంపి నాటకం

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అటవీ శాఖాధికారిని శృతిలయ.. భర్త ధరావత్ హరినాథ్(39)ను ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చింది. పాల్వంచ(M) వెంగళరావుపేటలో జరిగిన ఈ ఘటనలో, హరినాథ్ను గొంతు నులిమి చంపిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్కు ఉరివేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో భార్య, ప్రియుడు కౌశిక్ సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 20, 2025
కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


