News April 11, 2025
MNCL: సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు: కలెక్టర్

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సన్నబియ్యం విక్రయించడం, కొనుగోలు చేయవద్దని, విక్రయిస్తే రేషన్ కార్డు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్లు అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News April 17, 2026
ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.
News April 17, 2026
మళ్లీ హనుమకొండ పార్లమెంట్ సెగ్మెంట్?

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో మళ్లీ పాత హనుమకొండ రానున్నట్టు తెలుస్తోంది. గతంలోవరంగల్, హనుమకొండ ఎంపీ సెగ్మెంట్లు ఉండేవి. ఉమ్మడి జిల్లాలో జనగామ ప్రాంతం భువనగిరి పరిధిలో ఉండగా, దానిని హనుమకొండలో విలీనం చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా మహబూబాబాద్ , ఏటూరునాగారం, నర్సంపేట, డోర్నకల్ సెగ్మెంట్లను వరంగల్‌లో, పినపాక, ఇల్లెందులను కొత్తగా భద్రాచలంలో విలీనం చేసే ఛాన్సుంది.
News April 17, 2026
KNR: ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి రూ.5 కోట్ల దోపిడీ

జాబ్ గ్యారెంటీ అంటూ ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి నిరుద్యోగుల జేబులకు భారీ కన్నం వేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ కేంద్రంగా సాగిన ఈ ‘మాల్టా’ దందాలో 100మంది రూ.5కోట్లు పోగొట్టుకున్నారు. నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారు. కరీంనగర్, ఖానాపూర్, KPHBలో బాధితులు ఫిర్యాదు చేయడంతో వీటన్నింటినీ ఏకీకృతం చేసి CIDకి బదిలీ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఖాతాలను ఫ్రీజ్ చేశారు.


