News February 22, 2025

MNCL: సమస్యల పరిష్కారానికే దర్బార్: CP

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ శ్రీనివాస్ హాజరై స్పెషల్ పార్టీ, QRT సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతులను, సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా దర్బార్‌లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్‌కు వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చన్నారు.

Similar News

News November 26, 2025

తుదిదశకు రోడ్ల వెడల్పు శిథిలాల తొలగింపు

image

వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పుకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూ.42 కోట్ల అంచనా వ్యయంతో పట్టణంలోని మెయిన్ రోడ్డును 80 అడుగుల మేరకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా సుమారు 180 ఇండ్లను తొలగించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన కూల్చివేతలు తిరిగి ప్రారంభం కాగా వాటికి సంబంధించిన శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.

News November 26, 2025

వరంగల్: కోతుల పంచాయితీ తీరిస్తేనే.. గ్రామ పంచాయతీకి!

image

ఉమ్మడి వరంగల్‌లో కోతుల బెడద తీవ్రమవడంతో గ్రామ పంచాయితీ ఎన్నికలకే కొత్త పేరొచ్చింది. కోతుల పంచాయితీ తీరిస్తేనే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడటం, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలే ముందుకు రావడంతో, కోతుల సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికే ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. పంటలు నాశనం, ఇళ్లలోకి చొరబాటు, కోతుల దాడులతో గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి.

News November 26, 2025

చిత్తూరు: టెన్త్ హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్

image

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్‌పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.