News February 6, 2025

MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త

image

సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్‌ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.

Similar News

News January 14, 2026

HZB: కొత్తకొండ జాతరకు బస్సులను ప్రారంభించిన డీఎం

image

కొత్తకొండ జాతరకు వెళ్లే భక్తుల కోసం హుజూరాబాద్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30గా ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,014 మంది దర్శించుకోగా.. 19,639 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 14, 2026

యాంటీబయాటిక్స్‌తో ఎర్లీ ప్యూబర్టీ

image

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్‌ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్‌ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్‌ ప్రికాషియస్‌ ప్యుబర్టీ అంటారు.