News March 11, 2025
MNCL: సింగరేణిలో పలువురు అధికారులు బదిలీ

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేకే 5 డిప్యూటీ మేనేజర్ వి.ప్రవీణ్, ఆర్కే ఓసీ మేనేజర్ సుధీర్ జయవంత్ రావు, అడిషనల్ మేనేజర్ క్రిషన్ వినోద్ కుమార్, ఎస్ఈ ప్రశాంత్ జీవన్, శాంతిఖని అడిషనల్ మేనేజర్ గంగాప్రసాద్ రాయ్, ఆర్కే 1ఏ డీవైఎస్ఈ లక్ష్మీనారాయణ, ఎస్ఆర్పీ ఓసీ2 మేనేజర్ బ్రహ్మాజీ రావు, ఆర్కే 5 సీనియర్ అండర్ మేనేజర్ శరత్, ఖైరిగూడ ఓసీ ఎస్ఈ సూర్యనారాయణ బదిలీ అయ్యారు.
Similar News
News October 16, 2025
వనపర్తి: సిద్ధమైన ఇండోర్ స్టేడియం.. త్వరలోనే ప్రారంభం!

వనపర్తిలో పునరుద్ధరణ పనులకు నోచుకున్న ఇండోర్ స్టేడియం త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు క్రీడా శాఖ అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవతో తన నిధుల నుంచి రూ.10 లక్షలతో వుడెన్ షటిల్ కోర్ట్, రూ.5 లక్షలతో జిమ్ మెటీరియల్ తెప్పించి ఏర్పాట్లు చేయించారు. ఇండోర్ స్టేడియం ప్రారంభం అయితే ఆడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News October 16, 2025
మామునూర్ ఎయిర్పోర్టుకు రూ.90 కోట్లు, అంగన్వాడీలకు రూ.156 కోట్లు

TG: వరంగల్ మామునూర్ విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొత్తం 949 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించారు. మరో 223 మంది రైతుల నుంచి 253 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పోషకాహార పథకం (SNP) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన రూ.156 కోట్ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
News October 16, 2025
KNR: ‘కరాటేను ప్రభుత్వ క్రీడగా గుర్తించాలి’

MCK మాజీ డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరాటే సీనియర్, జూనియర్ మాస్టర్ల సమావేశం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల మాస్టర్లు పాల్గొన్నారు. కరాటేను ప్రభుత్వ క్రీడగా గుర్తించాలని, క్రీడాకారులకు ఇండ్ల స్థలాలు, వైద్యం, వంటివి కల్పించాలని మాజీ మేయర్ డిమాండ్ చేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరాటే బాడీని ఎన్నుకున్నారు.