News February 4, 2025
MNCL: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News March 14, 2025
ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతి

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మణికుమార్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా గుర్తించామన్నారు. కుటుంబ కలహాలతో వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కాలువలో దూకి మృతిచెందాడని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
News March 14, 2025
కామారెడ్డి: అక్కడ హోలీ పండగొస్తే గుండు ఎత్తాలి..!

హోలీ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. కాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామంలో హోలీ పండుగను విభిన్నంగా నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రజలంతా ఒక చోట చేరి పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు నిర్వహిస్తారు. అనంతరం ఆనవాయితీగా వస్తున్న బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. ఈసారి 95 కేజీల గుండును ఎత్తాలని పోటీ పెట్టగా యువకులు పాల్గొన్నారు.