News August 3, 2024
MNCL: సింగరేణి సంస్థలో భారీగా అధికారుల బదిలీ
సింగరేణి సంస్థలో భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 9 విభాగాల్లో 200 మందికి పైగా అధికారులకు స్థాన చలనం కలిగింది. ఒకేసారి ఇంతమంది బదిలీ కావడం పదేళ్లలో ఇదే ప్రథమం. ఎన్నికల ప్రక్రియ ముగిశాక బదిలీలపై సుదీర్ఘ కసరత్తు చేసిన యాజమాన్యం ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న వారిని వేరే
ప్రాంతాలకు బదిలీ చేసింది.
Similar News
News September 20, 2024
నిర్మల్ : సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం: ఎస్పీ
పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెలరోజుల ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు.
News September 20, 2024
మంచిర్యాల: పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి ఆత్మహత్య
పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి రమేష్(36) ఆత్మహత్య పాల్పడిన ఘటన హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమేశ్ మంచిర్యాలలో నివాసం అంటూ మెప్మాలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News September 20, 2024
బోథ్: రూ.81 వేల ధర పలికిన గణేశ్ లడ్డూ
బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గణేశ్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలిచారు. కాగా గురువారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో చివరగా రూ.81 వేలకు మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, మహేందర్ ఉన్నారు.