News February 28, 2025

MNCL: సింగరేణి సీఎండీ సాహసోపేత చర్య

image

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటన స్థలం సమీపంలోకి శుక్రవారం సింగరేణి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెస్క్యూ సభ్యుల్లో మనోధైర్యం నింపేలా సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ సాహసోపేత చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందంతో కలిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్ళారు. వారం రోజులుగా కేంద్ర, రాష్ట్ర బృందాలతో సహాయక చర్యల్లో సింగరేణి బృందం నిమగ్నం కాగా.. మరో 200 మంది సభ్యులు చేరుకున్నారు.

Similar News

News September 15, 2025

షాన్‌దార్ హైదరాబాద్.. ఇక పదిలం

image

HYD సంపద చారిత్రక కట్టడాలే. 12 వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లకు కూడా ఆహ్వానించింది. ఖైరతాబాద్ మసీదు, రొనాల్డ్ రాస్ భవనం, షేక్‌పేట మసీదు, చెన్నకేశవస్వామి గుడి, రేమండ్ సమాధి, హయత్‌బక్షిబేగం, పురానాపూల్ దర్వాజా, టోలి మసీదు, ఖజానా భవన్ (గోల్కొండ), షంషీర్ కోట, గన్‌ఫౌండ్రి, మసీదు ఇ మియన్ మిష్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.

News September 15, 2025

జగిత్యాల బిడ్డకు ‘మిస్ చికాగో’ కిరీటం

image

న్యూజెర్సీలో ఈ నెల 12న నిర్వహించిన విశ్వసుందరి అందాల పోటీల్లో ‘మిసెస్ చికాగో యూనివర్స్- 2026’ టైటిల్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బొజ్జ సౌమ్యవాసు గెలుచుకున్నారు. అమెరికాలో స్థిరపడి, ప్రస్తుతం ఓ బహుళ జాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, సామాజిక కార్యకర్తగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్య ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు.

News September 15, 2025

NGKL: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతగా మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.