News April 12, 2024
MNCL: సెల్‌ఫోన్ రిపేర్ చేయించలేదని యువతి సూసైడ్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన సాయిష్మ అనే యువతి సెల్‌ఫోన్ రిపేర్ చేయించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజుల కిందట సెల్‌ఫోన్ డిస్ ప్లే పగిలిపోవడంతో బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండగా గురువారం ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిష్మ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఏఎస్సై నాగరాజు తెలిపారు.
Similar News
News April 23, 2025
ADB: గ్రేట్.. వ్యవసాయ కూలీ బిడ్డకు 989 మార్కులు

వ్యవసాయ కూలీ బిడ్డ ఇంటర్ ఫలితాల్లో 989 మార్కలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. టాలెంట్‌కి పేదరికం అడ్డురాదని నిరూపించాడు నార్నూర్ మండలం ఖంపూర్ గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివినా ఇంటర్ ఎంపీసీలో 989 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కృష్ణను చదివించారు. కృష్ణకు మంచి మార్కులు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News April 23, 2025
నలుగురిపై కేసు.. ముగ్గురి అరెస్ట్: ADB SP

రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సయ్యద్ యాసిన్, జనాబ్, ముబారక్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండవ కేసులో హబీబ్, సర్దార్ (పరారీ) కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 23, 2025
ADB: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.