News March 21, 2025

MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

image

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News April 19, 2025

రామప్ప కనుమరుగయ్యే అవకాశం ఉంది: పాండురంగారావు

image

సింగరేణి ఓపెన్ కాస్ట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే రాబోయే రోజుల్లో రామప్ప ఆలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. వెంకటాపూర్‌లోని ఆలయాన్ని సందర్శించి వారు మాట్లాడారు. రామప్ప దేవాలయం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగి, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం జిల్లాకే గర్వకారణమన్నారు.

News April 19, 2025

BREAKING: గద్వాలలో యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

image

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. 

News April 19, 2025

HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

image

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.

error: Content is protected !!