News March 8, 2025
MNCL: స్ట్రక్చర్ సమావేశంలో పలు అంశాలపై ఒప్పందం

సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శుక్రవారం జరిగిన సీఅండ్ఎండీ స్థాయి స్ట్రక్చర్ సమావేశంలో అంశాలపై చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. పెర్క్స్ పై ఐటీ చెల్లించడంపై కమిటీ ఏర్పాటు, సొంత ఇంటి పథకం అమలు, అన్ని రకాల మజ్దూర్ల డిజిగ్నేషన్ మార్చుటకు, డిస్మిస్ కార్మికులకు ఐదేళ్ళలో ఏదైనా ఒక ఏడాదిలో 100 మాస్టర్లు ఉంటే ఒక అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Similar News
News November 21, 2025
తిరుపతి జిల్లాలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లా పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హోం మంత్రి అనిత వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్కు వెళ్లారు. కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ముర్ముకు వీడ్కోలు పలికారు.
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.
News November 21, 2025
పాయకరావుపేట: ఉపాధ్యాయురాలు మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి

పాయకరావుపేట మండలం రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు జోష్నాబాయి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి X లో పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.


