News February 10, 2025
MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
News December 7, 2025
సిరిసిల్ల: ఆల్ట్రా మారథాన్ రన్ లో పాల్గొన్న జిల్లా కానిస్టేబుల్

రాజస్థాన్లో నిర్వహించిన 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల ఆల్ట్రా మారథాన్ రన్ లో జిల్లాకు చెందిన ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. 100 కిలోమీటర్లు సాగిన ఈ రన్ లో అపారమైన ధైర్య సాహసాలు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ప్రదర్శించాడన్నారు. ఇటువంటి ఈవెంట్లో పాల్గొనడం ద్వారా యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
News December 7, 2025
వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పునఃప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. వారాంతపు సెలవుల కారణంగా నిన్న, ఈరోజు మార్కెట్ బంద్ ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.


