News March 16, 2025
MNCL: అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు సాయి శ్రీవల్లి

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు ఎంపికైంది. జూన్ 15 నుంచి 21వరకు జపాన్‌లో జరిగే సకురా అంతర్జాతీయ సైన్స్ సదస్సులో ఆమె పాల్గొననుంది. స్త్రీల నెలవారి రుతుక్రమం ప్రక్రియలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి శ్రీజ సొంతంగా రుతుమిత్ర కిట్ పరికరం రూపొందించింది. ఈ సందర్భంగా డీఈఓ యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబు ఆమెను అభినందించారు.
Similar News
News March 16, 2025
కాకినాడ: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్రూమ్లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.
News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్‌లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
News March 16, 2025
కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.