News April 2, 2025
MNCL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లపేటకు చెందిన తెలంగాణ హోటల్ యజమాని ప్రభుదాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన ప్రభుదాస్‌ను భార్య మందలించగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లని ఆయన ఇవాళ తెల్లవారుజామున హోటల్ పక్కన గల్లీలో ఒక ఇంటి ముందు సృహ కోల్పోయి ఉన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఈ మేరకు ఎస్సై వినీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 27, 2025
సాగుభూమి సంరక్షణ వ్యవసాయంలో కీలకం

సాగు భూములకు రసాయనాల వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, సంప్రదాయ, దేశవాళీ పంట రకాల పెంపకం, నేలకోత నివారణ చర్యలు, నేలను కప్పి ఉంచడం వంటి చర్యలతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, పశువుల వ్యర్థాలు, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
News December 27, 2025
WGL: అభివృద్ధి ఒక వైపేనా..!

గ్రేటర్ వరంగల్ నగరం పేరుకే గ్రేటర్‌లా ఉంది. అభివృద్ధి అంతా ఒక వైపే జరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు.వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో మాత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల లోపే పనులకు శంకుస్థాపనలు జరిగినట్టు ప్రజలు చెబుతున్నారు. వరంగల్ పశ్చిమలో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండగా.. మిగిలిన 2 ప్రాంతాల్లో కనిపించకపోవడం గమనార్హం.
News December 27, 2025
తిర్యాణి: తల్లిదండ్రులు మందలించారని యువతి SUICIDE

ASF జిల్లా తిర్యాణి మండలం నాయకపూగూడకు చెందిన పల్లె స్పందన(19) శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైంది. ఇంటికి రావాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఫినాయిల్ తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


