News March 18, 2025
MNCL: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

ఏప్రిల్ 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లాజిస్టిక్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి బుకింగ్ను సోమవారం మంచిర్యాల ఆర్టీసి డిపో మేనేజర్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు 7382841860, 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Similar News
News March 18, 2025
ఎచ్చెర్లలో భార్య హత్య .. లొంగిపోయిన భర్త

ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి కత్తితో నరికి హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం భార్యభర్తలిద్దరూ కలిసి ఉదయం కూలి పనికెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో హత్య చేశాడు. అనంతరం అప్పలరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.ఘర్షణకు కారణం తెలియాలి.
News March 18, 2025
ముక్కలుగా నరికి మూట కట్టారు

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో మహిళను ముక్కలుగా నరికి మూట కట్టేసి పడేశారు. దారుణంగా శరీర భాగాలు కట్ చేసి పడి ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. దుప్పట్లో నడుము కింది భాగం, ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2025
HYD: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయికి Fits

ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కీసర శ్రద్ధ కళాశాలలో ఎకనామిక్ పరీక్ష జరుగుతోంది. హాల్కు వచ్చిన విద్యార్థిని ప్రవళిక పరీక్ష రాస్తుండగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాచారం ESIకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.