News October 16, 2025
MNCL: ఈ నెల 17న మినీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ
చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2025
KNR: వ్యాధితో తల్లి.. గుండెపోటుతో తండ్రి దూరం..!

తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ.. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అతడిని చేరదీసి చదివించాలని కోరుతున్నారు.
News October 16, 2025
నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్‌గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.