News October 15, 2025

MNCL: ఈ నెల 18న కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీ

image

తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన అధికారి కార్యాలయ పరిధిలోని ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకుడు డా.కోటేశ్వర్ తెలిపారు. 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 1 పల్మనరి మెడిసిన్, 2 పీడియాట్రిక్ పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 10:30కు జిల్లా కార్యాలయంలో సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.

Similar News

News October 15, 2025

ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

image

IRCTC 16 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc హాస్పిటాలిటీ, BBA, MBA, BSc హోటల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల వారు ఈనెల 16, 17 తేదీల్లో కోల్‌కతాలోని IRCTC జోనల్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.irctc.com

News October 15, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న పుష్పయాగం. 29న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, 30న ఆర్జిత సేవలు రద్దు.
* రోగులు, క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు కొత్తగా 190 ‘108’ వాహనాలను అందుబాటులోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
* విజయనగరం జిల్లాలో JSW సంస్థ రూ.531.36 కోట్లతో 1166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్రభుత్వం అనుమతి

News October 15, 2025

MDK: ‘రూల్స్ పాటించకపోతే చర్యలే’

image

ప్రతి దీపావళికి జిల్లాలో 250 వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. మెదర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ తదితర ఏరియాల్లో భారీగా వెలుస్తాయి. అయితే దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టపాసుల షాపులను నిబంధనల మేరకే ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.