News April 10, 2025
MNCL: ఉచిత సమ్మర్ కోచింగ్.. APPLY NOW

మే 1 నుంచి 31 వరకు ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులకు పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు తెలిపారు. ఉదయం 6 నుంచి 8.30 వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News September 17, 2025
కొడంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కొడంగల్ నియోజకవర్గ తుంకిమెట్ల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దౌల్తాబాద్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కనకప్ప (26) అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పని చేసే కనకప్ప రాత్రి స్వగ్రామానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అన్న ఆశప్ప ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News September 17, 2025
నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.
News September 17, 2025
జీ.మాడుగుల: భార్యపై భర్త దాడి.. ఏడేళ్లు జైలు

జీ.మాడుగులలోని వలసమామిడికి చెందిన సారె కొండబాబు భార్యను సత్యవతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఏడాది కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించి మహిళ తండ్రి మసాడి అప్పారావు అప్పట్లో జీ.మాడుగుల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో విశాఖ ఆరవ ఏడీజే కోర్టు నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించినట్లు సీఐ బీ. శ్రీనివాస్ తెలిపారు.