News November 26, 2024

MNCL: ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం KCR: బాల్క సుమన్ 

image

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి యాది చేసుకుంటూ జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని BRS అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాలతో జిల్లా స్థాయి సన్నాక సమావేశం నిర్వహించారు. 29న దీక్ష దివస్ కార్యక్రమ విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.

Similar News

News December 18, 2025

ఆదిలాబాద్: ప్రమాణ స్వీకార పత్రం ఇదే..!

image

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇటీవల పంచాయతీ రాజ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన తేదీని 22న మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణానికి పత్రం విడుదల చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం గెలుపొందిన వారు సిద్ధంగా ఉన్నారు.

News December 18, 2025

ఆదిలాబాద్‌: స్కూలు వేళల్లో మార్పు

image

చలి తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ కలెక్టర్‌ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 9:40 గంటల- సాయంత్రం 4:30గం. వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

News December 17, 2025

ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్‌గా జాదవ్ రాంజీ

image

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్‌గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.