News December 5, 2025
MNCL: ఉపసంహరణ డెడ్ లైన్ రేపే.. అభ్యర్థులపై ఒత్తిడి..?

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెండో విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో వివిధ పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగి నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరణకు ఒప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో పల్లె రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Similar News
News December 5, 2025
గూడూరు ప్రజల సెంటిమెంట్ పట్టించుకోరా..?

దుగ్గరాజపట్నం పోర్టు కోసమే గూడూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరులో గూడూరు విలీనం లేదా గూడూరు జిల్లా అనేది దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇక్కడి మాట తీరు, కల్చర్ అంతా నెల్లూరుకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు మాది నెల్లూరేనని కొత్తవాళ్లతో పరిచయం చేసుకుంటారు. ఇంతలా అక్కడి వాళ్లు నెల్లూరుతో బంధం పెంచుకున్నారు.
News December 5, 2025
ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.
News December 5, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

NH 161పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అల్లాదుర్గ్ కాయిదంపల్లి పెద్దమ్మ ఆలయం వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్.. కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేట్ మండలం మునిగేపల్లికి చెందిన కారు డ్రైవర్ సోయల్(25) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన సోయల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.


