News May 7, 2024

MNCL: ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భానుడు హడలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా లింగాపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.

Similar News

News January 17, 2025

మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు

image

మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

News January 17, 2025

ఉట్నూర్: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. పీజీలో 55% ఉత్తీర్ణత కలిగి ఉండి నెట్, సెట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 20 తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News January 17, 2025

ADB: 140 మహారాష్ట్ర దేశీదారు బాటిల్స్ స్వాధీనం 

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన దినేష్ వద్ద 140 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ సి.హెచ్. కరుణాకర్ రావ్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు తీసుకొచ్చి ఆదిలాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించే క్రమంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో దినేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దేశీదారు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.