News December 17, 2025

MNCL: ఎన్నికలకు కట్టుదిట్టమైన బందోబస్తు: సీపీ

image

మంచిర్యాల జిల్లాలో బుధవారం జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను సైతం సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు.

Similar News

News December 17, 2025

ఈ రెండ్రోజులు శివారాధన చేస్తే?

image

శివారాధనకు నేడు(బుధ ప్రదోషం), రేపు(మాస శివరాత్రి) ఎంతో అనుకూలమని పండితులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం బుధ ప్రదోష వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. ఫలితంగా బుధుడి అనుగ్రహంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం, వాక్పటిమ పెరుగుతాయని అంటున్నారు. మార్గశిర మాస శివరాత్రి రోజున చేసే శివ పూజలతో పాపాలు నశించి, కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ప్రదోష, శివరాత్రి పూజల విధానం, టైమింగ్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 17, 2025

తరచూ ఇల్లు మారుతున్నారా?

image

చాలామంది కెరీర్, ట్రాన్స్‌ఫర్లు, పిల్లల చదువుల కోసం ఊళ్లు మారుతూ ఉంటారు. అయితే తరచూ ఇళ్లను మారడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో తరచూ ఇళ్లు మారుతోంటే పెద్దయ్యాక వాళ్లు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్‌ ప్లైమౌత్‌ చేసిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లలకు చిన్నతనంలో స్థిరమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందంటున్నారు.

News December 17, 2025

హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. అయితే!

image

AP: రాష్ట్రంలోని హజ్ యాత్రికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.లక్ష అందించనున్నట్లు తెలిపింది. అయితే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లే వారికే ఈ సాయం అందుతుందని చెప్పింది. ఆదాయంతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి వెళ్లేవారికి రూ.లక్ష అందజేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు మైనార్టీ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.