News February 23, 2025

MNCL: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

image

ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లీవ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లీవ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.

Similar News

News September 16, 2025

నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

image

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 16, 2025

అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.

News September 16, 2025

మంజీరా నది ఉరకలేస్తుంది..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.