News January 31, 2025

MNCL: కరెంట్ సమస్యలా. 1912కి కాల్ చేయండి

image

ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తిన టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల  ఫెయిల్యూర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, తీగలు, విద్యుత్ మీటర్లు, బిల్లుల్లో సమస్యలపై 1912 నంబర్‌ను సంప్రదించి సేవలు పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 28, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 28)

image

1927: భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం
1928: విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం
1948: రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం
1963: భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)
* నేషనల్ సైన్స్ డే
* వరల్డ్ టైలర్స్ డే

News February 28, 2026

ఏన్కూర్‌లో ఎంపీపీఎస్ హెచ్‌ఎమ్ సస్పెండ్

image

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.

News February 28, 2026

దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడిపై విచారణ

image

మధిర మండలం ZPHS దెందుకూరులో తెలుగు ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావుపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల ఆయన అనుచితంగా ప్రవర్థించాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్‌ను ఎంక్వయిరీ అధికారిగా నియమించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని కూడా విచారణ బృందంలో చేర్చారు.