News January 30, 2025
MNCL: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
Similar News
News November 6, 2025
‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.
News November 6, 2025
20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.
News November 6, 2025
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి: కలెక్టర్

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరకాలలోని ధనలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు 13 మంది రైతుల నుంచి 140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పత్తి విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


