News January 28, 2025

MNCL: క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ పంపిణీ చేసిన సీపీ

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌కు కాళేశ్వరం జోన్ నుంచి ఎంపికైన క్రీడాకారులకు సోమవారం సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ట్రాక్ సూట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడాకారులు పతకం సాధిస్తామనే బలమైన నమ్మకం, పట్టుదలతో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కాళేశ్వరం జోన్‌కు అత్యధిక పతకాలు సాధించాలని సూచించారు.

Similar News

News November 5, 2025

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.

News November 5, 2025

పంచాయతీ కార్యదర్శులపై కీలక నిర్ణయం

image

AP: గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్(GPDO)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేతనాల్లో మార్పుల్లేకుండా ప్రస్తుతమున్న 5 కేడర్‌లను నాలుగుకు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 3,082 గ్రేడ్-1, 3,163 గ్రేడ్-2, 6,747 గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్‌ మారింది.

News November 5, 2025

NGKL: భక్తి జ్వాలలో ప్రకాశిస్తున్న కార్తీక పౌర్ణమి

image

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కాగా, ఈరోజు పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.