News December 6, 2025

MNCL: డేటా నమోదులో తప్పులు ఉండకూడదు: డీఈఓ

image

మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో శనివారం యూడైస్ (UDISE) వర్క్‌షాప్ జరిగింది. డీఈఓ యాదయ్య మాట్లాడుతూ.. ఎంఈఓలు హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించి, పాఠశాలల్లోని మౌలిక వసతులు సహా అన్ని వివరాలను తప్పులు లేకుండా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. యూడైస్ డేటాకు కేటాయించిన 580 మార్కుల ఆధారంగానే జిల్లాకు ర్యాంకు, సౌకర్యాల మంజూరు ఆధారపడి ఉంటుందని ప్లానింగ్ కోఆర్డినేటర్ భరత్ తెలిపారు.

Similar News

News December 7, 2025

ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

image

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

News December 7, 2025

అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

image

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్‌కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.

News December 7, 2025

అంతనపురం మహిళా నేతకు కీలక పదవి

image

బీజేపీ మహిళా మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన సౌభాగ్య నియామకమయ్యారు. ఈ మేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు నియామక పత్రం శనివారం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సౌభాగ్య చెప్పారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.