News January 31, 2025
MNCL: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

మంచిర్యాలలోని కాలేజీ రోడ్‌కు చెందిన చిట్యాల తరుణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే తరుణ్ పనికి సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి సూరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాహనాల కూలెంట్ తాగాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఏఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు.
Similar News
News September 18, 2025
పెద్దపల్లి టాస్క్‌లో రేపు జాబ్ మేళా

పెద్దపల్లిలోని పాత MPDO కార్యాలయం దగ్గర గల TASK రీజినల్ సెంటర్ లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగం కోసం ఆసక్తి గల నిరుద్యోగులు ఉ. 10గంటల వరకు తమ రెజ్యూమ్ కాపీలు, ఐడీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకొని రావలసి ఉంటుందన్నారు. B.Tech/డిగ్రీ/డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించవచ్చు.
News September 18, 2025
VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్‌ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.
News September 18, 2025
పార్వతీపురం: ‘స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత’

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ పి-4 బంగారు కుటుంబాల శిక్షణా తరగతులపై సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చని పేర్కొన్నారు.