News October 23, 2025

MNCL: నవంబర్‌లో బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన

image

మంచిర్యాల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన నవంబర్‌లో నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 2024-25లో ఎంపిక చేసిన 108 ఇన్స్పైర్ ప్రదర్శనలను 5వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా కాలుష్యం తగ్గించడం అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్‌ను సంప్రదించాలని తెలిపారు.

Similar News

News October 23, 2025

మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

image

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.

News October 23, 2025

ఈనెల 25న కర్నూలులో జాబ్ మేళా

image

ఈ నెల 25న కర్నూలులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి బుధవారం తెలిపారు. ఈ మేళాలో ఆరంజ్ ఫైనాన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఫొటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు. www.ncs.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News October 23, 2025

NLG: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె దాన్యం సేకరణపై పౌర సరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్‌లో కలెక్టర్ సమీక్షించారు.