News April 15, 2025

MNCL: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 600 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 60 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.

Similar News

News November 1, 2025

HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.

News November 1, 2025

వీధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: DEO

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, హాజరును ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈఓ సూచించారు.

News November 1, 2025

రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట: హోం మంత్రి

image

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని హోం మంత్రి ఆదేశించారు. ఆలయానికి ప్రతి శనివారం 1500 నుంచి 2 వేల మంది వస్తుంటారని చెప్పారు. ఆలయంలో మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని చెప్పారు.