News April 25, 2025
MNCL: నేడు సైన్స్ సమ్మర్ క్యాంపు ప్రారంభం

మంచిర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం సైన్స్ సమ్మర్ క్యాంపును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. మే నెల 8వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమ్మర్ క్యాంపు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన తృష్ణ తీర్చేందుకు ఈ క్యాంపు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 25, 2025
NRML: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.
News April 25, 2025
NRML: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇన్‌ఛార్జ్ ఎస్సై శ్రావణి కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడకు చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించింది. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పత్తి చేనులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
News April 25, 2025
KMR: ప్రియుడితో కలిసి భర్తను చంపింది

రామారెడ్డి PSలో ఏడాది క్రితం మిస్సైన కేసును పోలీసులు చేధించారు. ASP చైతన్యరెడ్డి వివరాలిలా.. ఇస్సన్నపల్లి వాసి తిరుపతి భార్య మనెవ్వకు లింబయ్యతో అక్రమ సంబంధం ఏర్పడిందని తేలింది. తిరుపతి అడ్డుగా ఉన్నాడని లింబయ్య మరో ఇద్దరితో కలిసి తిరుపతిని మందు తాగుదాం అని చెప్పి డొంకల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.