News February 24, 2026

MNCL: నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు

image

సాంకేతిక ఆధారాలతో నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం నిర్వహించిన జనవరి నెల నేర సమీక్షలో మాట్లాడారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలన్నారు. దీర్ఘకాల పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు.

Similar News

News February 25, 2026

పట్టణాల్లో ఇళ్లు లేని వారికి GOOD NEWS

image

PMAY- U 2.0 కింద కొత్తగా 2.88L ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో మహిళలకు 1.60L గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581, SCలకు 35,525, STలకు 9,773, OBCలకు 82,190 ఇళ్లను కేటాయించనుంది. దీంతో ఈ స్కీమ్‌లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61Lకు చేరింది. తాజా నిర్ణయంతో AP, TG సహా 16 రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. కాగా ఈ పథకం కింద ప్రభుత్వం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది.

News February 25, 2026

ఖమ్మం: సైబర్ ట్రాఫికింగ్‌పై అప్రమత్తత అవసరం

image

మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్‌పై అంగన్‌వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి విజేత పిలుపునిచ్చారు. ‘ప్రజ్వల’ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేమ, ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అండగా నిలవాలని ఆమె సూచించారు.

News February 25, 2026

HYD: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 1,75,271 మంది విద్యార్థులు 217 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తారు. 1st ఇయర్‌లో 81,898 మంది, 2nd ఇయర్‌లో 93,373 మంది ఉన్నారు. మాస్ కాపీయింగ్‌ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు CC రూమ్‌కు అనుసంధానించారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.