News December 20, 2025
MNCL: పంచాయతీ ఎన్నికల్లో జోరుగా మద్యం అమ్మకాలు

మంచిర్యాల జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలతో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికలు ముగిసే సరికి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 73 మద్యం దుకాణాల్లో సాధారణ రోజుల్లో నిత్యం రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. ఈ 11 రోజుల్లో రూ.35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
Similar News
News December 22, 2025
జాకబ్ డఫీ హిస్టరీ క్రియేట్ చేశాడు

న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ దేశం తరఫున ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు(81) తీసిన ప్లేయర్‌గా నిలిచారు. దీంతో ఆ దేశ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(79w-1985)ను అధిగమించారు. కాగా డఫీ ఈ ఏడాది 4 టెస్టులు, 11 వన్డేలు, 21 టీ20లు ఆడారు. మరోవైపు మూడో టెస్టులో వెస్టిండీస్‌పై NZ 323 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో 2-0తో సిరీస్‌ను వశం చేసుకుంది.
News December 22, 2025
చండూరు: కుమారుడి ప్రమాణస్వీకారం రోజే తండ్రి మృతి

చండూర్ మండలం తుమ్మలపల్లిలో విషాదం నెలకొంది. తన కుమారుడు రాజేశ్ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసే రోజే, మాజీ సర్పంచ్ సురేందర్ గుండెపోటుతో మృతిచెందారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సురేందర్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతోషంగా ఉండాల్సిన రోజున ఇలా జరగడం హృదయవిదారకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర శోకాన్ని నింపింది.
News December 22, 2025
1729.. దీన్ని రామానుజన్ నంబర్ ఎందుకంటారు?

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జబ్బు పడి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, ప్రొఫెసర్ హార్డీ ఆయన్ని కలవడానికి ట్యాక్సీలో వెళ్లారు. దాని నంబర్ 1729. హార్డీ అది బోరింగ్ నంబర్ అనగా.. రామానుజన్ వెంటనే దాని గురించి చెబుతూ రెండు వేర్వేరు ఘనాల (Cubes) జతల మొత్తంగా (పైన చిత్రంలో చూపినట్లుగా) రాయగలిగే అతి చిన్న నంబర్ ఇదేనని చెప్పారు. అందుకే దీన్ని Ramanujan Number అంటారు. ఈరోజు రామానుజన్ జయంతి (గణిత దినోత్సవం).


