News April 7, 2025

MNCL: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో సోమవారం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, 65 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 390 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో చేరగా.. 7,280 పేపర్లు మూల్యాంకనం చేశారు. మూల్యాంకనాన్ని డీఈఓ యాదయ్య పర్యవేక్షించారు.

Similar News

News December 24, 2025

MBNR: పీయూలో అథ్లెటిక్స్‌ ఎంపికలు ప్రారంభం

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని సింథటిక్ మైదానంలో దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ (మహిళల) జట్టు ఎంపికలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ హాజరై క్రీడలను ప్రారంభించారు. వర్సిటీలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ అందుబాటులో ఉండటం క్రీడాకారులకు వరం లాంటిదన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

News December 24, 2025

డీజీపీ ఆదేశాలతో వరంగల్ పోలీసుల్లో వణుకు!

image

గీత దాటితే వేటు తప్పదంటూ DGP శివధర్ రెడ్డి ఆదేశాలతో వరంగల్ పోలీసుల్లో వణుకు మొదలైంది. గత కొద్ది నెలలుగా WGL కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి వ్యవహారాలే నడుస్తుండటంతో కొంతమంది పోలీస్ అధికారులు తేలు కుట్టిన దొంగల్లా జారుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే, ఏసీపీతో పాటు సీఐ, ఎస్సైలను విధుల్లో నుంచి తొలగించిన మరుసటి రోజే డిజీపీ నుంచి ఆదేశాలు వెలువడటంతో కొందరు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

News December 24, 2025

రాయికల్ పెద్ద చెరువులో గుర్తుతెలియని శవం

image

రాయికల్ పట్టణం పెద్ద చెరువు సమీపంలోని తుమ్మకొలులో గుర్తుతెలియని యువకుడి శవం లభ్యం కావడంతో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం మత్స్యకారులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టీ-షర్ట్ ధరించి ఉన్నాడని, చేతిపై పచ్చబొట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.