News March 4, 2025
MNCL: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
Similar News
News September 16, 2025
పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
JAN నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు: CBN

AP: రాష్ట్రంలో రేపటి నుంచి OCT 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపట్టాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయటం కొందరికి అలవాటు. కాలువల్లో చెత్త వేస్తే ప్రవాహానికి అడ్డుపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో CC రోడ్లున్నా డ్రెయిన్లు సరిగ్గా లేవు. మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించాలి. గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. జనవరి నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు’ అని కలెక్టర్లకు సూచించారు.
News September 16, 2025
VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.