News February 1, 2025
MNCL: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమంగా నిలవాలి: DEO

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేలా కృషి చేయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ ఎయిడెడ్, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించే గ్రాండ్ టెస్ట్, మార్చిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నారు.
Similar News
News November 5, 2025
ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 5, 2025
పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.
News November 5, 2025
నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.


