News March 9, 2025
MNCL: పద్మ కుమార్‌కు ఉత్తమ మహిళా-ధాత్రి రత్న సేవా అవార్డు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం ప్రధాన కార్యదర్శి పద్మ కుమార్‌కు ఉత్తమ మహిళా-ధాత్రి రత్న సేవ అవార్డులు వరించింది. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్. ప్రియా చౌదరి ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. సమాజానికి అందిస్తున్న విశేష సేవలకు పద్మ కుమార్‌కు పురస్కారం అందజేశారు.
Similar News
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News November 5, 2025
సామూహిక దీపారాధనలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహించిన సామూహిక దీపారాధన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. కాగా, సామూహిక దీపారాధన కార్యక్రమంలో భాగంగా భక్తులు వివిధ ఆకారాల్లో వెలిగించిన దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
News November 5, 2025
వేములవాడ రాజన్న క్షేత్రంలో జ్వాలాతోరణం

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో బుధవారం సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వేళలో శ్రీ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు సాయంత్రం ఆలయ రాజగోపురం ముందు భాగంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహా పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


