News March 2, 2025
MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: డీఈవో

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శనివారం ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డెపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
Similar News
News February 27, 2026
KPHBలో గజం భూమి ధర రూ.2.65 లక్షలు

KPHBలో హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో KPHBలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు విక్రయమైంది. 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్ ధర రూ.1.10 కోట్లకు చేరింది. మొత్తం 12 ఆస్తుల వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ ద్వారా రూ.15.81 కోట్లు, ఫ్లాట్స్ రూ.8.45 కోట్లు వచ్చాయి.
News February 27, 2026
ఆదిలాబాద్: వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలి: అదనపు కలెక్టర్

క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. భూ వివాదాల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎంపికైన వారు వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. భూ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
News February 27, 2026
పెండింగ్ కేసులపై వేగం పెంచాలి: తిరుపతి SP

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ సుబ్బారాయుడు పెండింగ్ కేసులను గడువులోపు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలలు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలు, గాంజాపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేయాలన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచి అవసరమైతే పీడీ, PIT NDPS చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


