News March 23, 2025

MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రశ్న, జవాబు పత్రాల రవాణా, బందోబస్తు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలకు వైద్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

Similar News

News November 12, 2025

32,438 పోస్టులు.. రేపటి నుంచి అడ్మిట్ కార్డులు

image

రేపటి నుంచి గ్రూప్-D <<17650787>>పరీక్షలకు<<>> సంబంధించి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నట్లు RRB(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) తెలిపింది. 32,438 పోస్టులకు ఈ నెల 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చంది. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందుగానే పరీక్ష తేదీ, సిటీ వివరాలను RRB వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

News November 12, 2025

సంగారెడ్డి: కాంట్రాక్ట్ పద్ధతిన 12 పోస్టులు భర్తీ

image

జిల్లా వైద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 12 పోస్టులు భర్తీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల మంగళవారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి 12 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు.

News November 12, 2025

HYD: ఈ టైమ్‌లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

image

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.