News December 10, 2025

MNCL: పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏళ్ల శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి మంచిర్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.12 వేలు జరిమానా విధించారు. సీసీసీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాస్టర్‌గా పనిచేసే బోరెం సాయి సునీల్ 2021లో 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో రుజువైంది. బాధితురాలికి రూ.4 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని జడ్జీ ఆదేశించారు.

Similar News

News December 12, 2025

MHBD జిల్లాలో కాంగ్రెస్‌కే 80 సర్పంచ్ స్థానాలు

image

మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రాత్రి 10 వరకు సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 146 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్-80, బీఆర్ఎస్-47, బీజేపీ-5, స్వతంత్ర అభ్యర్థులు-14 మంది సర్పంచ్‌లు‌గా గెలుపొందారు.

News December 12, 2025

4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

image

TG: ఫుట్‌బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్‌ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్‌గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్‌లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

News December 12, 2025

కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

image

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.