News March 19, 2025
MNCL: పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి: CP

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చూస్తామన్నారు. అందరూ సమన్వయంతో క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని కోరారు. కమిషనరేట్, తెలంగాణ పోలీసులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.
Similar News
News March 19, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి: డీఈవో

పదో తరగతి పరీక్షా విధులు నిర్వహించే ఉపాధ్యాయులను 20వ తేదీన రిలీవ్ చేయాలని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు చీఫ్ సూపరింటెండ్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. 21 నుంచి వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాలన్నారు.
News March 19, 2025
స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలి: కలెక్టర్

ఏప్రిల్ 30న సింహాచలంలో జరిగే చందనోత్సవంకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూలైన్లలో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈఓను ఆదేశించారు.
News March 19, 2025
రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు తిరుమలలో పర్యటించనున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ పయనమవుతారు.