News March 5, 2025

MNCL: ‘ప్రాథమిక విద్య భవిష్యత్తుకు పునాది’

image

ప్రాథమిక విద్య అనేది ప్రతి వ్యక్తి భవిష్యత్తుకు పునాది లాంటిదని DEO యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో నూతన ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి ఉన్నత చదువులకు అనుగుణంగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

Similar News

News November 1, 2025

హ్యాకథాన్‌లో మెరిసిన రాజంపేట విద్యార్థులు

image

తిరుపతిలో నిర్వహించిన SYNAPSE 2K25– 24 గంటల హ్యాకథాన్‌లో రాజంపేట అన్నమాచార్య యూనివర్శిటీ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించి టాప్ 10 జట్లలో స్థానం సాధించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల నుంచి అనేక బృందాలు పాల్గొన్నాయి. జాతీయ స్థాయి సాంకేతిక పోటీలో ఎల్‌ఎంఎస్ ప్లాట్‌ఫారమ్ విత్ కంపెనీ కన్‌స్ట్రెయింట్స్ అంశంపై వినూత్న పరిష్కారాన్ని రాజంపేట విద్యార్థులు రూపొందించారు.

News November 1, 2025

విజయవాడ: NTRకి.. అచ్చొచ్చిన గది ఇదే.!

image

విజయవాడలోని దుర్గాకళామందిర్‌లోని ఓ గది అంటే నందమూరి తారక రామారావుకి ఎంతో సెంటిమెంట్. 1934లో ఆయన ఇక్కడే నాటకాలు వేసేవారు. ఆయన నటించిన మొత్తం 175సినిమాలు ఇక్కడే ప్రదర్శితమయ్యాయి. ఈ గది కలిసిరావడంతో, NTR విజయవాడ వచ్చినా, షూటింగ్‌లు జరిగినా హోటళ్లలో దిగకుండా ఇక్కడుండేవారు. TDP కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే నడిచేవి. ఆయన ఉదయం వ్యాయామం చేసి, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ,సాంబార్ తెప్పించుకునేవారు.

News November 1, 2025

కార్తీక శుద్ధ ఏకాదశి: ఎంత శుభప్రద దినమంటే?

image

కార్తీక శుద్ధ ఏకాదశి ఎంత పవిత్ర దినమో బ్రహ్మ, నారదులు వివరించారు. ఈరోజున ఏకాదశి వ్రతం చేస్తే.. పాపాలు పూర్తిగా తొలగి, 1000 అశ్వమేధ, 100 రాజసూయ యాగాల పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. కొండంత పత్తిని ఓ నిప్పు రవ్వ కాల్చినట్లుగా.. ఈ ఉపవాస వ్రతం వేల జన్మల పాపాలను దహించివేస్తుందని నమ్మకం. చిన్న పుణ్య కార్యమైనా పర్వత సమాన ఫలాన్నిస్తుందట. ఈ వ్రతం చేస్తే.. సాధించలేనిదంటూ ఉండదని బ్రహ్మ వివరించాడు.