News April 11, 2025
MNCL: ఫూలే జయంతి ఉత్సవాలకు సింగేరేణి నిధులు

సింగరేణివ్యాప్తంగా శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు యాజమాన్యం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ ఆదేశాల మేరకు జీఎం (వెల్ఫేర్) పర్సనల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ.25 వేలు, జైపూర్ లోని ఎస్టీపీపీకి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేశారు.
Similar News
News April 18, 2025
NZB: దాశరథి పురస్కారానికి జిల్లా వాసి ఎంపిక

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్‌లో పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు.
News April 18, 2025
వినూత్నంగా కేఎల్ రాహుల్ కూతురు పేరు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ పాపకు ‘ఇవారా విపులా రాహుల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవారా అంటే అర్థం ‘దేవుడి బహుమతి’ అని పేర్కొన్నారు. పాప ‘నానీ’ గౌరవార్థం విపులా అని పెట్టినట్లు తెలిపారు.
News April 18, 2025
సిరిసిల్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.లక్ష పంపిణీ

సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష నిధులు విడుదల చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందన్నారు. ప్రాజెక్టు కింద పైలెట్ ప్రాజెక్టుకింద మొత్తం1023 ఇళ్లు మంజూరు చేశామన్నారు.