News March 18, 2025
MNCL: బంగారం చోరీ.. ఇద్దరి అరెస్ట్: ACP

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోషంను కత్తితో చంపుతామని బెదిరించి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ జుబీర్ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ సోమవారం తెలిపారు. సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, కత్తి, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
Similar News
News March 18, 2025
రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.
News March 18, 2025
కామారెడ్డి జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

KMR జిల్లాలో MROలు బదిలీ అయ్యారు. సురేశ్ బిచ్కుంద నుంచి రాజంపేట, రేణుక చౌహన్ డోంగ్లి నుంచి లింగంపేట, హిమబిందు జుక్కల్ నుంచి పల్వంచకు, వేణుగోపాల్ పిట్లం నుంచి బిచ్కుంద, మహేందర్ ఎల్లారెడ్డి నుంచి జుక్కల్ బదిలీ అయ్యారు. నరేందర్ గౌడ్ లింగంపేట్ నుంచి డోంగ్లి, సతీష్ రెడ్డి గాంధారి నుంచి మాచారెడ్డి, అనిల్ కుమార్ రాజంపేట నుంచి పిట్లం, సువర్ణ రామారెడ్డి నుంచి DAO సబ్ కలెక్టర్ బాన్సువాడకు నియమించారు.
News March 18, 2025
నల్గొండ: ఇఫ్తార్ విందుకు ఫండ్స్ రిలీజ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా నిధులు (రూ.లక్షలలో) నల్గొండ-5, మిర్యాలగూడ-4, దేవరకొండ-3, సాగర్-3,నకిరేకల్-3, మునుగోడు-3, కోదాడ-4, సూర్యాపట-3, హుజూర్ నగర్-3, తుంగతుర్తి-3, భువనగిరి-3, ఆలేరు-2 లక్షలు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.