News August 28, 2025
MNCL: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం నియామకం

బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఒక కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, ఐటీ కన్వీనర్లతో పాటు 45 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, 10 మంది శాశ్వత ఆహ్వానితులను నియమించినట్లు పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
ఎల్లంపల్లి: హరీశ్‌రావు, KTR చెప్పినట్లు చేస్తే అంతే ఇగ: CM

‘గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ, జంక్షన్ లాంటిది. సాంకేతిక సలహాలు తీసుకుని ప్రాజెక్టుకు రిపేర్ చేస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను నాణ్యతా లోపంతో కట్టారు. అవి కూలుతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తామైతే లోపలికి వెళ్లి చూడలేదు. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని తెలిసింది. హరీశ్‌రావు, KTR చెప్పినట్లు చేస్తే ఊళ్లకు ఊళ్లు మునుగుతాయి’అని CM రేవంత్ రెడ్డి అన్నారు.
News August 28, 2025
GWL: నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా

పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. అక్కడ విసిబిల్ అవుతున్న వివరాలు, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానా వివరాలను ఎస్పీకి సిబ్బంది వివరించారు.
News August 28, 2025
ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు:
HTML5, CSS3, JavaScript, Bootstrap 5
Java, Python
Database
Aptitude & Reasoning, Soft-Skills & IT-Skills
డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6లోగా ఐటీ హబ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నెం. 95025 05880.