News February 8, 2025

MNCL: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News July 6, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.

News July 6, 2025

పైసా పెట్టు.. కార్డు పట్టు.. జిల్లాల్లో ఇది పరిస్థితి.!

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతుంది. కాగా ఇదే అదునుగా భావించి ఇరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్లు రేషన్ కార్డు మంజూరు కోసం చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన రేషన్ కార్డు మంజూరు కోసం రూ.2, 3 వేలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు.

News July 6, 2025

రేపు అమలాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నాలుగు మున్సిపల్ కార్యాలయాలు, 22 మండల కేంద్రాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.