News March 19, 2025

MNCL: భారమంతా.. బడ్జెట్‌పైనే..!

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై మంచిర్యాల జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో జిల్లాలోని మందమర్రి మండలం గాంధారి ఖిల్లా, జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్, జైపూర్ మండలం శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం, దండేపల్లి మండలం గూడెంగుట్ట సత్యనారాయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 3, 2025

ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు ఏరియల్ సర్వే

image

నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ భద్రత, పనుల పూర్తి కోసం ఏరియల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్ సర్వే సోమవారం ప్రారంభం కానుంది. సీఎం, మంత్రి ఉత్తమ్ సమక్షంలో ఎన్‌జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే మొదలు పెడతారు. 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరణ లక్ష్యంగా 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లైయింగ్ షెడ్యూల్ చేశారు.

News November 3, 2025

MDK: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News November 3, 2025

గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

image

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుక‌తో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గ‌ర్భిణుల్లో విట‌మిన్ డి లోపం ఉండ‌డం వ‌ల్ల శిశువులు అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు, మ‌ల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ D సప్లిమెంట్లు వాడటం, సూర్యరశ్మిలో సమయం గడపడం వల్ల దీన్ని అధిగమించొచ్చని సూచిస్తున్నారు.