News October 9, 2025

MNCL: ‘మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే షీటీం లక్ష్యం’

image

మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా షీటీం పనిచేస్తున్నట్లు మగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్‌లో రెండు షీటీం బృందాలు పనిచేస్తూ మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో మంచిర్యాల జోన్ షీటీం నంబర్ 8712659386 సంప్రదించాలన్నారు. డయల్ 100కు కాల్ చేసి తక్షణ సహాయం పొందాలన్నారు.

Similar News

News October 9, 2025

వైద్య విద్యపై జగన్‌ది దుష్ప్రచారం: పల్లా

image

పీపీపీ విధానంపై జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. తన హయాంలోనే జీవోలు 107, 108, 133 ఇచ్చి 50% సీట్లను ప్రైవేటు కోటాకు కేటాయించిన జగన్, ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేవలం 18% పనులు చేసిన జగన్ సర్కార్ అసమర్థత వల్లే 1,750 సీట్లు రద్దయ్యే దశకు వచ్చాయని, తమ పీపీపీ విధానంతో ఆ సీట్లను కాపాడామని స్పష్టం చేశారు.

News October 9, 2025

విశాఖలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు

image

సెట్విన్, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 16న మద్దిలపాలెం వి.ఎస్.కృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. 15-29 ఏళ్ల యువతీ, యువకులు జానపద నృత్యం, గీతాలు, పెయింటింగ్ వంటి పలు అంశాల్లో పోటీపడవచ్చు. జిల్లా విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 14న సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సెట్విన్ సీఈవో కవిత కోరారు.

News October 9, 2025

కర్నూలు జిల్లా నూతన జేసీగా నూరుల్

image

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూరుల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవ్యను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్ పర్సన్‌గా నియమించింది.