News November 5, 2025
MNCL: మహిళల రక్షణ కోసం షీ టీమ్స్: సీపీ

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ పని చేస్తున్నాయని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2 షీ టీం బృందాలు పని చేస్తున్నాయన్నారు. మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కమిషనరేట్ షీ టీం నం.6303923700, మంచిర్యాల జోన్ నం. 8712659386కు కాల్, వాట్సాప్ ద్వారా మెసేజ్ లేదా డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.
Similar News
News November 5, 2025
MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.
News November 5, 2025
8 కిలోమీటర్లు కాలినడకన గుట్టకు చేరిన కలెక్టర్

కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 8 కి.మీ.లు నడిచి చండ్రుగొండ మండలం కనకగిరి (కనకాద్రి) గుట్టపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ బాధ్యత మనదేనన్నారు. గుట్టపై సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల తయారీదారులైన గిరిజనులను ఆయన అభినందించారు.
News November 5, 2025
దేశాన్ని కించపరిచే ప్రయత్నం: రాహుల్‌పై బీజేపీ ఫైర్

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ <<>>జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై BJP తీవ్రంగా స్పందించింది. అవి నిరాధార, అసత్య ఆరోపణలని, దేశాన్ని కించపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడింది. భారత వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ గేమ్స్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి రిజిజు ఫైరయ్యారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే ఈసీని లేదా కోర్టును ఆశ్రయించాలని, కానీ ఆయన అలాంటివి చేయరని ఎద్దేవా చేశారు.


